Natyam ad

 ఒక్క జనవరిలో 627 మంది ప్రాణాలు…

హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెలలో రహదారులు రక్తమోడాయి. రాష్ట్రవ్యాప్తంగా జనవరి నెలలో మొత్తం 2027 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా వాటిల్లో 2038 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. 627 మంది మృతి చెందారు. అతి వేగంతో ప్రయాణించడం, మద్యం మత్తులో వాహనం నడపడం అంశాలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇక మొత్తంగా చూస్తే రాచకొండ కమిషనరేట్ పరిధిలో అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, ఆ తరువాతి స్థానంలో సంగారెడ్డి, సైబరాబాద్‌, వరంగల్‌లు నిలిచాయి.రాచకొండలో 47 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా, సంగారెడ్డిలో 41, సైబరాబాద్‌, వరంగల్‌లలో 40 చొప్పున, ఖమ్మం, మెదక్‌, నాగర్‌కర్నూల్‌లలో 27 చొప్పున, కామారెడ్డిలో 25, సూర్యాపేట, నిజామాబాద్‌లలో 23 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోయారు. పోలీసు, పంచాయతీ రాజ్, మున్సిపల్‌, హెల్త్‌, రోడ్లు, భవనాల శాఖలు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అనేక చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ మానవ తప్పిదాలు, ఇతర అంశాల కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.సీట్‌ బెల్టులు, హెల్మెట్లను ధరించకపోవడం వల్ల చాలా మంది ప్రమాదాల బారిన పడ్డప్పుడు ప్రాణాలను కోల్పోతున్నారు. అలాగే ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకపోవడం, మద్యం మత్తులో వాహనాన్ని నడిపించడం, అతి వేగం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు త్వరలో మరిన్ని చర్యలు చేపట్టేందుకు శ్రీకారం చుడుతోంది.
 
Tags:627 killed in January alone …