Natyam ad

అంబేద్కర్‌ సిద్ధాంతాలు నిత్య స్ఫూర్తి

-టీటీడీ డిఈవో డాక్టర్‌ భాస్కర్‌రెడ్డి

 

తిరుపతి ముచ్చట్లు:

 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్‌ సిద్ధాంతాలు భావి తరాలకు వెలుగులు నింపుతాయని టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్‌ భాస్కర్‌రెడ్డి అన్నారు.ఆదివారం మహతి ఆడిటోరియంలో బాబా సాహెబ్ 133వ జయంతి వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించింది.ఈ సందర్భంగా డిఈవో మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయ స్ఫూర్తికి ప్రతిరూపమన్నారు. ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు.టీటీడీ చీఫ్ పిఆర్వో డాక్టర్ టి.రవి మాట్లాడుతూ ,డాక్టర్ అంబేద్కర్ కుల వివక్షను నిర్మూలించడం, విద్యను ప్రోత్సహించడం వంటి సామాజిక సంస్కరణ ఉద్యమాలు నిర్వహించినట్లు తెలిపారు. తాను మరణించిన తర్వాత కూడా తన లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంతో పాటు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని వివరించారు.ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు, యూనియన్ నాయకులు ప్రసంగించారు.డిప్యూటీ ఈవోలు  గోవిందరాజన్,  లక్ష్మణ్ నాయక్,  దేవేంద్రబాబు,  స్నేహలత మరియు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Ambedkar’s theories are an eternal inspiration

Post Midle