నవంబరు 6న 13వ విడత బాలకాండ అఖండ పారాయణం
తిరుమల ముచ్చట్లు:
లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై నవంబరు 6న ఆదివారం 13వ విడత బాలకాండ అఖండ పారాయణం జరుగనుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.బాలకాండలోని 61 నుండి 65 సర్గల వరకు గల 137 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
Tags: Balakanda Akhanda Parayanam 13th episode on 6th November

