సెల్ టవర్ వద్దంటూ అందోళన
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సెల్ఫోన్ టవర్ మాకు వద్దు అంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. అదే కాలనీలో నివాసం ఉంటున్న ఓ కానిస్టేబుల్ ఇంటిపై జియోటవర్ ను ఫిట్టింగ్ చేస్తున్నారు. ఒక టవర్ నిర్మించాలంటే చుట్టుపక్కల ఉన్న ప్రజల అభిప్రాయం సేకరించి వారికి ఇబ్బంది లేదు అంటేనే సెల్ఫోన్ టవర్ పెట్టుకోవచ్చు. కానీ చుట్టుపక్కల వారిని ఎవరినిసంప్రదించకుండా అధికారులు ముడుపులు తీసుకుని వారికి పర్మిషన్ ఇచ్చారని స్థానికులు ఆరోపించారు. దీనిపై కమిషనర్ కు, చైర్ పర్సన్ కు ఈ సెల్ఫోన్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని స్థానికులు అర్జీ
ఇచ్చారు. వారు స్పందించి మేము తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా జియో కంపెనీ సిబ్బంది పట్టించుకోకుండా మళ్లీ నిర్మాణ పనులను మొదలు పెట్టడంతో స్థానికులు వారినిఅడ్డుకోబోగా వారిలో కొందరు దురుసుగా మాట్లాడారు. దాంతో స్థానికులు వారిపై మండిపడ్డారు.
Tags: Cell tower is missing

