జర్నలిస్టులచే సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
చిత్తూరు ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి చిత్రపటానికి జర్నలిస్టులు పాలాభిషేకం చేశారు. ఏపియుడబ్లూజె ప్రతినిధి లోకనాథం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా అక్రిడెటెడ్ జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలాల ఇండ్ల పట్టాలు ఇవ్వాలని మంత్రి వర్గంలో ముఖ్యమంత్రి తీర్మాణించడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యల కోసం కష్టపడే జర్నలిస్టులను గుర్తించి, సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రికి , మంత్రి మండలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, హరీష్, మురళి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: CM Jagan’s picture is blessed by journalists
