Natyam ad

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు

– జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అధికారి

 

చిత్తూరు ముచ్చట్లు:

 

సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి, అత్యవసర శాఖలో పనిచేసే ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల శాఖలు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు వారి ఓటు హక్కుని ఈ నెల 5, 6 వ తేదీలలో వినియోగించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.సార్వత్రిక ఎన్నికలు-2024కు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని, ఈ నేపథ్యంలో జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సంబంధించి ప్రతి నియోజకవర్గ పరిధిలో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఫెసిలిటేషన్ కేంద్రాలలో ఉ.9.30 నుండి సా.6 గం. ల వరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోగలరని, జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాలలో పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగస్తులు జిల్లా కలెక్టరేట్ లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ ఆ ప్రకటన తెలిపారు.

ఫెసిలిటేషన్ వివరాలు :

165-పుంగనూరు నియోజకవర్గం నందు ఫెసిలిటేషన్ కేంద్రం – బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పుంగనూరు

170-నగరి నియోజకవర్గం నందు ఫెసిలిటేషన్ కేంద్రం – జడ్పీ ఉన్నత(బాలికలు) పాఠశాల, పుత్తూరు

171-జీ డి నెల్లూరు నియోజకవర్గం నందు ఫెసిలిటేషన్ కేంద్రం –ఎం పి పి పాఠశాల, జీ డి నెల్లూరు
172-చిత్తూరు నియోజకవర్గం నందు ఫెసిలిటేషన్ కేంద్రం –పి వి కే ఎన్ ప్రభుత్వ కళాశాల గిరీం పేట, చిత్తూరు

173-పూతలపట్టు నియోజకవర్గం నందు ఫెసిలిటేషన్ కేంద్రం – జడ్పీ ఉన్నత పాఠశాల, పూతలపట్టు

174-పలమనేరు నియోజక వర్గం నందు ఫెసిలిటేషన్ కేంద్రం – ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పలమనేరు

175-కుప్పం నియోజకవర్గం నందు ఫెసిలిటేషన్ కేంద్రం – ప్రభుత్వ డిగ్రీ కళాశాల – కుప్పం

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు విధిగా

1. ఎపిక్ ఐ డి(ఓటరు కార్డు)

2. ఆదార్ కార్డ్ మరియు ప్రభుత్వం చే జారీ చేయబడ్డ ఇతర గుర్తింపు కార్డులు.

3. ఎన్నికల విధులకు కేటాయిస్తూ ఇచిన ఉత్తర్వుల కాపీలను తీసుకు వెళ్ళాల్సి ఉంటుందని తెలిపారు.

 

Tags:Postal ballot facility can be availed