గోరంట్ల బుచ్చయ్య పీయేపై కానిస్టేబుల్ దాడి-అందోళనకు దిగిన గోరంట్ల
రాజమండ్రి ముచ్చట్లు:
రాజమండ్రి రామాలయం సెంటర్ లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిఏ జి.చంద్ర శేఖర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేయడం వివాదానికి దారి తీసింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారని తన చేతిలో వున్న వైర్ లెస్ సెట్ తో పి ఏ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ కొట్టడంతో అయన తలపై బలమైన గాయం అయింది. విషయం తెలుసుకుని గోరంట్ల, బుచ్చయ్య చౌదరి, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఫైన్ వేయాలి కానీ చేతిలో ఏది వుంటే దానితో రక్తం కారేలా దాడి చేస్తారా అనిప్రశ్నించారు. వెంటనే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. ఘటనపై ఎస్పీకి పిర్యాదు చేసి బాధితుడిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం చంద్రశేఖర్ ను తీసుకెళ్లారు.

Tags: Constable attack on Gorantla Butchayya PE- Gorantla is worried
