అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మ హత్య

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలో ఓ చేనేత కార్మికుడు అప్పులు బాధ తాళ లేక ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉగాది పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాడు మంగళవారం వెలుగుచూసిన విషాదకర ఘటనపై పోలీసుల కథనం… నీరుగట్టువారిపల్లి లోని మాయబజార్లో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు జి.మల్లికార్జున (42) భార్య మాధవి, ముగ్గురు కూతుళ్లు ఉండగా అందరికి పెళ్లిళ్లు చేసేసాడు. దీంతో పెళ్లిళ్లకు చేసిన అప్పుల బాధ తాళ లేక జీవితం పై విరక్తి చెందాడు. అర్థరాత్రి సమయంలో అందరూ నిద్రపోయాక ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. రెండవ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags; Due to the pain of debt, the handloom worker commits suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *