ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలి      

-సూరయ్యపల్లి సర్పంచ్ భీముని పుష్ప

మంథని ముచ్చట్లు:


సూరయ్యపల్లి గ్రామంలోని  ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని             సూరయ్యపల్లి సర్పంచ్ భీముని పుష్ప  పిలుపునిచ్చారు.          మంథని మండలం సూరయ్యపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి ఐదు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ భీముని పుష్ప శనివారం ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని 440 గృహాలను సందర్శించి ఇంటికి ఐదు మొక్కల చొప్పున గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ భీముని పుష్ప మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో మొక్కలను పెంచి పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామస్తులకు అందిస్తున్నామని అన్నారు. ఇండ్లు సుందరికరణ కోసం పూల మొక్కలను సైతం అందిస్తున్నామని, మన అవసరాల కోసం పండ్ల మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రామస్తులందరూ తప్పనిసరిగా ఈ మొక్కలను పెంచి పోషించాలన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసి భీముని వెంకటస్వామి, ఉప సర్పంచ్ రాజిరెడ్డి, వార్డ్ సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Everyone should be a partner in environmental protection

Leave A Reply

Your email address will not be published.