నూజివీడులో ఉప్పొంగిన దేశభక్తి.
నూజివీడు ముచ్చట్లు:
భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా నూజివీడులో “హెరిటేజ్ వాక్” నిర్వహించారు. నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో, డి.ఎస్.పి శ్రీనివాసులు పర్యవేక్షణలో నూజివీడు ట్రిపుల్ ఐటి, స్థానిక విద్యాసంస్థల విద్యార్థులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొనగా, జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న సమయంలో నూజివీడులో బస చేసిన నందనవనం వద్దనుండి పీజీ సెంటర్ వరకు హెరిటేజ్ వాక్ సాగింది. పట్టణ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు విద్యార్థులు 250 మీటర్లు పొడవు ఉన్న జాతీయ జెండాను చేత బూని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీగా పీజీ సెంటర్ వరకు కొనసాగారు. భారతదేశం 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడంతోపాటు స్వతంత్ర సమరయోధుల త్యాగాలతో స్ఫూర్తిని పొందాని నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి అన్నారు. నూజివీడుకు ఎంతో ఘన కీర్తి, చరిత్ర ఉందని విద్యార్థులు చరిత్రను తెలుసుకొని మీరు కూడా చరిత్రను సృష్టించాలని డి.ఎస్.పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
Tags: Exuberant patriotism in Nujividu.

