కావలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
-ఇద్దరు మృతి…పది మందికి గాయాలు
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ లారీని లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పది మందికి గాయాలు అయ్యాయి. మృతులు దగ్గు మళ్ళీ యాకోబు,(45), కొండమూరి ఆదాం(45) గా గుర్తించారు. ప్రమాద ఘటన సమయంలో మినీ లారీ లో 20 మంది వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్నారు. వారంతా నాయుడుపేట నుండి బాపట్ల వద్ద చెరుకూరు వెళుతున్నారు. వ్యవసాయ కూలీలు పొలం పనుల కోసం బాపట్ల నుండి నాయుడుపేటకు వచ్చారు. క్షతగాత్రులను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Tags: Fatal road accident on Kavali National Highway
