Natyam ad

భూస్వాముల ఆక్రమించిన ప్రభుత్వ భూములను పేదలకు పెంచాలి

– సిపిఐ నాయకుల డిమాండ్

 

మహానంది ముచ్చట్లు:

మహానంది మండలం బుక్కాపురం గ్రామ పొలిమేరకు చెందిన 4459 ఎకరాల . ప్రభుత్వ భూములను. బడా భూస్వాములు. అధికార పార్టీనాయకుల అండ దండలతో  ఆక్రమించుకొని దర్జాగాఅనుభవిస్తున్నారని సీపీఐ నాయకులు విమర్శించారు . ప్రభుత్వ అధికారులు వెంటనే స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఈ విషయం పలు మార్లు మండల ప్రభుత్వ అధికారులకువిన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించి అనంతరం డిఆర్ఓ మల్లికార్జున గారికి ఆర్జిలతో కూడిన వినతిపత్రం ఇవ్వడంజరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలు గా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. ఎస్. బాబా ఫకృద్దీన్. పాల్గొన్నారు  ఈ సందర్భంగా సిపిఐ జిల్లాకార్యదర్శిఎన్.రంగనాయుడు మాట్లాడుతూ. జిల్లాలో ప్రభుత్వ భూములు బడా భూస్వాములు ఆక్రమించుకొని పేదలకు దక్కకుండా వారి స్వలాభాలకోసం ఆక్రమించుకొని. అనుభవిస్తుంటే జిల్లా ప్రభుత్వయంత్రాంగమం నిమ్మకు నిరేత్తి నట్టు ఉండడము విచారకరమని అన్నారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులతో పాటు బుక్కాపురం గ్రామ ప్రజలు సుగుణమ్మ. సుభాన్.నబి రసూల్. లక్ష్మీబాయిఈశ్వరమ్మ సుగుణ బాయ్ తోపాటు వందలాదిమంది ప్రజలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Government lands occupied by landlords should be given to the poor

Post Midle