Natyam ad

జెఎన్టీయూ స్నాతకోత్సవాన్ని ప్రారంభించిన గవర్నర్.

హైదరాబాద్ ముచ్చట్లు:
 
జె.ఎన్.టి.యు.హెచ్ 10వ స్నాతకోత్సవాన్ని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ డా.తమిళసై సౌదరరాజన్ శనివారం ప్రారంభించారు. కేంద్ర సైన్ మరియు టెక్నాలజీ కార్యదర్శి డా.శ్రీవారి చంద్ర శేఖర్ కి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసారు.
వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 95 మందికి బంగారు పతకాలను అందజేసారు.
2019-20 & 2020-21 విద్యా సంవత్సరానికి 1,19,106 యు.జి., పిజి & పి.హెచ్.డి. డిగ్రీలను జె.ఎన్.టి.యు అందచేసింది. గవర్నర్ మాట్లాడుతూ బంగారు పథకాలు సాధించిన వారికి, సాధించని వారికి శుభాకాంక్షలు. యువతలో డిప్రెషన్ పెరిగిపోతుంది. చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకోలేక పోతున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే విద్యార్ధి దశ నుండే ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోవాలి. ఎప్పటికి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. సమస్యలను ఎదుర్కునే శక్తి పెంపొందించుకోవాలి. పట్టాలు అందుకుంటున్న వారు ఉద్యోగాల కోసం వెతుకున్నే వారు కాకుండా ఉద్యోగాలు కల్పించే వారిలా మారాలి. మీరు ఉన్న స్థాయికి కారణమైన తల్లిదండ్రులను, ఉపాద్యాయులను ఎప్పటికి మరువకూడదని అన్నారు.
 
Tags:Governor inaugurates JNTU graduation ceremony