కర్నూలు లో న్యాయ రాజధాని కోసం భూమ మద్దతు కోరిన న్యాయ వాదులు
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల పట్టణంలో బుధవారం నాడు . కర్నూలు లో న్యాయ రాజదాని ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వాలని భూమా బ్రహ్మానందరెడ్డి ని కలిసి మద్దతు కోరిన న్యాయవాదులు. కర్నూలు లో న్యాయ రాజదాని ఏర్పాటుకు తమవంతు మద్దతు పలకాలని నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నీ కలిసి వినతిపత్రం అందజేశారు..
పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అజెండా తెచ్చారని అందుకు మద్దతుగా కర్నూలు లో న్యాయ రాజదాని ఏర్పాటు చేయాలని విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నామని వారు వినతు పత్రంలో పేర్కొన్నారు..ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని న్యాయవాదులు భూమాను కోరారు..అనంతరం భూమా మాట్లాడుతూ ఈ విషయాన్ని తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు.

Tags: Lawyers sought land support for judicial capital in Kurnool
