Natyam ad

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల, త్రినాధరావు నక్కిన, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  “ధమాకా”

హైదరాబాద్ ముచ్చట్లు:

నుండి మాస్ రాజా లిరికల్ వీడియో సెప్టెంబర్ 23న విడుదల
మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ మేకర్స్ చార్ట్‌బస్టర్‌ ‘జింతాక్‌’తో గ్రాండ్ మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ మాస్ రాజా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పాట సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ అని టైటిల్ సూచిస్తోంది. మాస్ రాజా సాంగ్‌లో మాస్ మహారాజా మాస్ డ్యాన్స్‌లను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రవితేజ ఊర మాస్‌గా కనిపిస్తున్నారు. తన గ్రేస్ ఫుల్ మూమెంట్స్ తో ఆదరగొట్టడానికి రెడీ అయ్యారు.
త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల, రవితేజకి జోడిగా సందడి చేయనుంది. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్.

 

Post Midle

Tags: Mass Maharaja Ravi Teja, Srileela, Trinadha Rao Nakkina, People Media Factory “Dhamaka”

Post Midle