Natyam ad

 రెండు రోజులలో తప్పిపోయిన ఇద్దరు పిల్లలను గుర్తించి  తల్లి వద్దకు చేర్చిన పోలీసులు.

తిరుపతి ముచ్చట్లు:
ఆమె ఒక బిచ్చగత్తె.. కారణాలు ఏవైనా ఆమెకు ఇద్దరు పిల్లలు, ఐదు సంవత్సరాల గాయత్రి.. మూడు సంవత్సరాలు అవినాష్.
భిక్షాటన చేస్తూ పిల్లల ఆకలి తీర్చేది ఆ తల్లి… అయితే విధి మరో బిచ్చగత్తె రూపంలో ఆమె కాటు వేసింది… తన ఇద్దరు పిల్లలను కోల్పోయి విలవిలలాడేలా చేసింది.  ధైర్యం కోల్పోకుండా తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించింది… తద్వారా విషయం యస్.పి గారి దృష్టికి వచ్చింది.  తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి  వెంకట అప్పల నాయుడు, ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకున్నారు… ఇద్దరు బిడ్డలను దూరం చేసుకుని ఆ తల్లి పడుతున్న ఆవేదన తొలగించాలని నిర్ణయించుకున్నారు…ఇంకేముంది వెంటనే రంగంలోకి నిష్ణాతులైన అనుభవం కలిగిన సిబ్బంది టీమ్గా ఏర్పడి వెతుకులాట ప్రారంభించారు.  కంప్లైంట్ అందిన వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్  ముద్దాయిని గుర్తించారు.. ఆ తరువాత బాధితురాలి ఫిర్యాదులో పేర్కొన్న యొక్క ఫోన్ నెంబర్ను ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.   ఈ నెల 3వ తేదీ ఆ అభాగ్యురాలు అయిన బిచ్చగత్తె మరొకరిని నమ్మినందుకు తన బిడ్డలని పోగొట్టుకుంది… అయితే ఏమి! యస్.పి గారి చొరవతో ప్రత్యేక శ్రద్ధతో, మెరికల్లాంటి అనుభవజ్ఞులైన టీం సభ్యుల కృషి తో ఆమె బిడ్డల్ని కేవలం రెండు రోజుల గడువులో తిరిగి చేర్చడం జరిగింది.    ఆ అభాగ్యురాలు ఆనందానికి హద్దులే ఆకాశం అయింది… అది మాటలలో వర్ణనాతీతం… ఎందుకంటే బిచ్చగత్తె అయినా ఆమె తల్లి కదా.     వివరాల్లోకి వెళితే బాధితురాలు దుర్గాదేవి కదిరి రైల్వే స్టేషన్ లో భిక్షాటన చేసుకుంటూ ఉండగా బెంగళూరు నగరానికి చెందిన ఈశ్వరమ్మ భిక్షాటన చేస్తూ పరిచయమైంది..వారి పరిచయం దుర్గాదేవిని తన పిల్లలతో సహా తిరుపతికి వచ్చేలా చేసింది.    మార్చి 2వ తేదీ తిరుపతి చేరుకున్న తర్వాత మూడవ తేదీ రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈశ్వరమ్మ కు అప్పగించి బస్టాండ్ లో ఉన్న తన లగేజీ తీసుకురావడానికి దుర్గాదేవి వెళ్ళింది. తిరిగి వచ్చే లోపు పిల్లలు ఈశ్వరమ్మ కనపడలేదు దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యస్.పి గారి పర్యవేక్షణలో ఏర్పడిన విచారణ బృందం మొబైల్ నెట్వర్క్ ఆధారంగా వెతుకులాట ప్రారంభించారు.. దీనితో పాటు వివిధ ప్రసార మాధ్యమాలలో సీసీ ఫుటేజ్ ద్వారా పొందిన ఫొటోలను ప్రచురించారు.          ప్రసార మాధ్యమాలు లోని సమాచారాన్ని పిల్లల ఫోటోలను చూసిన వారు పిల్లలను కాట్పాడి రైల్వే స్టేషన్ ఒకటో ప్లాట్ఫామ్పై గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ముద్దాయి అరెస్టు చేసి అపహరణకు గురైన ఇద్దరు పిల్లలను రక్షించ గలిగారు.
ఈస్ట్ డిఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ రెడ్డి  ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మరియు సిబ్బంది అరెస్టు చేయడం జరిగింది.
Tags:Police found the two missing children within two days and rushed them to the mother.