గంజాయి స్వాధీనం
నందిగామ ముచ్చట్లు:
విశాఖ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న గంజాయిని కీసర్ టోల్ ప్లాజా వద్ద కంచికచర్ల పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రెండు కార్లలో 100 కేజీల గంజాయిని ముగ్గురు వ్యక్తులు తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో రెండు కార్లతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లలో ప్రత్యేకంగా అమర్చిన ఆరలలో 100 కేజీల గంజాయి దాచినట్లు గుర్తించారు. కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు రెండు కార్లతో సహా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు తరలించారు.
Tags: Possession of marijuana

