స్కూళ్లు కిటకిట..రెండేళ్లలో ఏకంగా 13 లక్షల మంది చేరిక

-రెండేళ్లలో ఎంతో మార్పు
 
అమరావతి ముచ్చట్లు:
 
ఇక రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో పాఠశాలల అడ్మిషన్లలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.ఇటీవల విడుదలైన 2020–21 సామాజిక–ఆర్థిక (సోషియో–ఎకనమిక్‌) సర్వే గణాంకాల ప్రకారంవైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో(2018–19లో) రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య 70,43,071 కాగా2020–21 నాటికి ఆ సంఖ్య 83,76,020కి చేరింది.అంటే .రెండేళ్ల కాలంలోనే 13,32,949 మంది పిల్లల చేరికలు పెరిగాయి.విచిత్రమేమంటే .23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతలా చేరికలు ఏనాడూ లేవు.ఇక 2000–01 నుంచి చూసుకుంటే .ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం చేరికల సంఖ్య 75,01,162 మాత్రమే.రాష్ట్రం విడిపోయే ముందు ఏడాది 2013–14లో73,37,267 మాత్రమే విద్యార్థుల చేరికలు ఉన్నాయి.2014–15లో ఇది 72,32,771గా నివేదికల్లో పొందుపరిచారు.ఆ తరువాత నుంచి రాష్ట్రంలో చేరికలు 70 లక్షలలోపు మాత్రమే ఉన్నాయి.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మాత్రమే ఒక్కసారిగా పాఠశాల విద్యలో మార్పులు చోటుచేసుకుని చేరికలు పెరిగాయి.నోట్ : సీఎంగా వైఎస్ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ఉపాధ్యాయులు దీనిని అర్థం చేసుకోవాలి.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Schools are closed .. 13 lakh students enroll in two years

Natyam ad