Natyam ad

నేడు ఉక్రెయిన్ రష్యా మధ్య రెండో దఫా చర్చలు..

రష్యా ముచ్చట్లు:
 
రష్యా, ఉక్రెయిన్‌ మధ్య రెండో దఫా శాంతి చర్చలు (Peace talks) నేడు జరగనున్నాయి. బెలారస్‌లోని గోమెల్‌ పట్టణంలో సోమవారం ఇరుదేశాల అధికారులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య నేడు జరగనున్న చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నారు. కాగా, తొలివిడుత చర్చల్లో ప్రాథమిక డిమాండ్లపై ఇరు దేశాలు పట్టు వీడకపోవడం తో విఫలమయ్యాయి.యుద్ధాన్ని తక్షణమే విరమించాలని ఉక్రెయిన్‌ కోరుతుండగా, నాటోలో చేరమని హామీ ఇవ్వాలని రష్యా పట్టుపడుతున్నది. దీంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడింది. అదేవిధంగా క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా గుర్తించాలని రష్యా కోరుతున్నది.ఈ నేపథ్యంలో బుధవారం జరిగే చర్చలు ఫలితానిస్తాయని పశ్చిమదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.అయితే యూరోపియన్‌ యూనియన్ (ఈయూ)లో చేరేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పెట్టుకున్న దరఖాస్తును ఈయూ పార్లమెంట్‌ ఆమోదించింది.ప్రత్యేక విధానం ద్వారా తమను చేర్చుకోవాలని కోరడంతో ఆ ప్రక్రియను ఈయూ ప్రారంభించింది.కాగా, ఉక్రెయిన్‌పై రష్యా తన సైనిక చర్యను నిలివేయాలని నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ విజ్ఞప్తిచేశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై దాడిచేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
 
Tags: Second round of talks between Ukraine and Russia today.