Natyam ad

 సీఎం ఉద్యోగ ప్రకటన మభ్య పెట్టడమే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.

హైదరాబాద్ ముచ్చట్లు:
ఉద్యోగాల పేరుతో తెలంగాణ యువకులను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ మరోసారి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ప్రథమ డిమాండ్ ఉద్యోగాలుగా పేర్కొన్నారు.ఉద్యోగ నియామకాలపై ఇచ్చిన మాట తప్పిన సీతక్క.. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు అంటున్నారని అన్నారు. సీఎం ప్రకటన మభ్య పెట్టేటట్లు కనిపిస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బోగస్ మాటలు పక్కన పెట్టి, ఉద్యోగ నియామకాలకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉస్మానియాలో సంబరాలు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..
అసెంబ్లీ లో 80వేలకు పైగా  ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటన తో ఉస్మానియా యూనివర్సిటీ లో  టీఆర్ఎస్వీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫొటో కి పాలాభిషేకం చేశారు.ఇక  తెలంగాణ భవన్ లో సంబరాలు మిన్నంటాయి. ‘నిరుద్యోగ బంధు కేసీఆర్’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
సూర్యాపేటలో కేసీఆర్ చిత్రపటానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల పాలాభిషేకం
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని హర్షిస్తూ సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి వైద్య ఆరోగ్య శాఖా కాంట్రాక్ట్ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.  స్వీట్లు పంచుకుని టపాసులు కాల్చి తన సంతోషాన్ని వ్యక్తంచేశారు.అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనపై నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ గ్రంథాలయంలో నిత్యం పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తున్న యువత ఈ ప్రకటన పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంటనే రిక్రూట్ మెంట్ ప్రారంభించాలని టీవీ9తో మాట్లాడిన నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబ్‌ మేళాను ప్రశంసించారు ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేసారి 90వేల ఉద్యోగాల ప్రకటన గొప్పగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కు పొలిటికల్‌ మైలేజ్‌ కూడా ఉంటుదని మెచ్చుకుంటూనే.. మా ఏపీలో అయితే జీతాలకే డబ్బులేదంటూ.. జగన్ ప్రభుత్వంపై సెటైర్లు విసిరారు.
 
Tags:The job advertisement of the CM is to deceive .. Congress MLA Sitakka