Natyam ad

గద్వాల ఎమ్మెల్యేకు భారీ ఊరట

న్యూఢిల్లీ ముచ్చట్లు:

Sri Bandla Krishna Mohan Reddy


 గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎన్నికల వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే విధించింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నికల చెల్లదంటూ బీజేపీ నాయకురాలు డీకే అరుణ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కృష్ణ మోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు… తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని నిర్ధారణ కావడంతో కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హతా వేటు వేసి.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. ఇందులో యాభై వేల రూపాయలు డీకే అరుణకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారుదీంతో తెలంగాణ హైకోర్టు తీర్పుపై కృష్ణ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. కృష మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించారు. కొద్ది రోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యేలపైనా ఇలాగే అనర్హతా వేటు వేశారు.

 

 

Post Midle

దీంతో ఆయన సుప్రీంకర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా తో పోటీలో ఓడిపోయిన జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా ప్రకటించారు. కానీ సుప్రీంకోర్టు స్టే వల్ల ప్రమాణస్నీకారం చేయలేకపోయారు. 2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ దాదాపుగా  28వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అనర్హతా వేటు వేయాలని డీకే అరుణ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూండగానే ఆమె పార్టీ మరిపోయారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి  బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు.  హైకోర్టు తీర్పును అమలు చేస్తే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు. అయితే ఎమ్మెల్యే పదవి కాలం దాదాపుగా ముగిసిపోయే దశకు వచ్చింది.  మళ్లీ ఎన్నికల కోసం  కేసీఆర్ ..  బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులోనూ.. కృష్ణమోహన్ రెడ్డి అభ్యర్థిగా చోటు దక్కించుకున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చారు.

 

Tags: A huge relief for Gadwala MLA

Post Midle