Natyam ad

తొమ్మిది నెలల చిన్నారి ప్రాణం తీసిన నిమ్మకాయ

అనంతపురం ముచ్చట్లు:

ముక్కు పచ్చలారని చిన్నారిని నిమ్మకాయ బలిగొంది. ఈ సంఘటన  పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు… గ్రామానికి చెందిన గోవిందరాజు, దీప దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడేళ్ల తరువాత చిన్నారి జస్విత (9 నెలలు) జన్మించిం ది. చిన్నారి ఆడుకుం టూ ఉన్నట్టుండి నిమ్మకాయ నోట్లో పెట్టుకుంది. గొంతులో ఇరుక్కుపోయిన నిమ్మకాయను తీయ డానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిం చారు. సాధ్యం కాకపోవడంతో పెద్దవడు గూరులోని ప్రయివేటు క్లినిక్కు తీసుకెళ్లారు. అక్కడా వీలు కాలేదు. దీంతో 108 వాహనంలో అనంతపురం తీసుకెళుతూ మార్గమధ్యంలోని పామిడిలో ఓ ప్రయివేటు డాక్టర్ వద్ద చూపిం చారు. అప్పటికే చిన్నారి శ్వాస ఆగిపోయిందని డాక్టర్ తెలపడంతో అక్కడి నుంచి పామిడి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒక్కగా నొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.

 

Post Midle

Tags: A lemon that took the life of a nine-month-old child

Post Midle