శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సీనియర్ జడ్జి సి.ప్రవీణ్ కుమార్
శ్రీకాళహస్తీ ముచ్చట్లు:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సీనియర్ జడ్జి సి.ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విచ్చేశారు.వారిని ఆలయ దక్షిణ గాలిగోపురం వద్ద స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రత్యేక దర్శనం చేయించారు.శ్రీ మేధా గురుదక్షిణామూర్తి స్వామి సన్నిధానం వద్ద ఆలయ
శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు, అందజేశారు. వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి గారు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ నరేంద్ర ,ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్
సుదర్శన్, కిషోర్ రెడ్డి, ఏ.పీ.ఆర్ఓ. శ్రీనాథ్ మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Tags:Andhra Pradesh State High Court Senior Judge C. Praveen Kumar visited Srikalahasteeshwara Swamy
