Natyam ad

గ్రామ పంచాయతీలకు సహాయ సహకారాలు

పెద్దపల్లి ముచ్చట్లు:

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంజిఎన్ఆర్ఇజిఎస్ 20 లక్షల రూపాయల నిధులతో  గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి  పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నువ్వు గజమాలతో పాలకవర్గం సన్మానించింది.
ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు, గ్రామంలో పెండింగ్లో ఉన్న పనులకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, కాట్నేపల్లి నుండి నీరుకుల వరకు బిటి రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు .
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ జడ్పీటీసీ మినుపాల స్వరూప ప్రకాష్ రావు, ఎంపీపీ బాలాజీ రావు, గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి , ఉపసర్పంచ్ సాయి శేఖర్ గౌడ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు  కాంగ్రెస్ పార్టీ నాయకులు  గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Post Midle

Tags: Assistance to Gram Panchayats

Post Midle