Natyam ad

భగ్గుమన్న బంగారం

ముంబై ముచ్చట్లు:

శంలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. రోజురోజుకీ ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం తులం బంగారంపై రూ. 200 వరకు పెరగగా ఈరోజు (గురువారం) కూడా గోల్డ్‌ ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి, రూ. 61,800కి చేరింది. ఇక దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690వద్ద కొనసాగుతోంది.
* ముంబయిలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 వద్ద కొనసాగుతోంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800గా ఉంది.
* ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది.
* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,800గా ఉంది.
* ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. గురువారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది. ఒఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 77,500గా నమోదైంది.
* ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఫోన్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడమే. 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయి.

 

Post Midle

Tags: Bhaggumanna is gold

Post Midle