మహిళల జాబితాలో గాయత్రి దేవి పేరు
అమరావతి ముచ్చట్లు:
గాయత్రీ దేవి 1919 లో రాజకుటుంబంలో జన్మించారు. కేవలం 12 సంవత్సరాల వయసులో మాన్ సింగ్ మూడవ భార్యగా మరియు జైపూర్ మహారాణి గా వెళ్ళింది. మొదటి ఇద్దరు భార్యలు అంగీకరించిన పర్దా వ్యవస్థకు ఆమె నిరాకరించింది. వోగ్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని 10 మంది అందమైన మహిళల జాబితాలో గాయత్రి దేవి పేరు చోటు చేసుకుంది అంటే ఆమె అందం గురించి ఊహించవచ్చు.1962, గాయత్రీ దేవి జైపూర్ నుండి లోక్సభ ఎన్నికలలో పోటీ చేసి, భారీ మెజారిటీతో సి రాజగోపాలచారి స్థాపించిన పార్టీ స్వతంత్ర పార్టీ టిక్కెట్‌పై గెలిచారు.గాయత్రి దేవి, ఇందిరా గాంధీ తమ యవ్వనం నుండే ఒకరినొకరు తెలుసు. పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పాఠశాల అయిన పాఠా భవనాలో ఇద్దరూ యువతులుగా పాఠశాలకు హాజరయ్యారు.

ఖుష్వంత్ సింగ్ ఇలా వ్రాశారు:
“ఇందిరా తనకన్నా అందంగా కనిపించే స్త్రీని సహించ లేకపోయింది. పార్లమెంటులో ఆమెను అవమానించింది, ఆమెను బిచ్ అని గాజు బొమ్మ అని వర్ణించేది. గాయత్రి దేవి వ్యవహారం ఇందిరా గాంధీలోని గల చెత్త మనస్తత్వాన్ని , చవకబారు ప్రతీకార ధోరణిని బయటపెట్టింది ”ది ఇండిపెండెంట్ పత్రికలో ఒక నివేదిక ప్రకారం ఇందిరా, గాయత్రి ల సంబంధాన్ని ఇలా పేర్కొంది: పార్లమెంటులో గాయత్రి దేవి ఉనికి ఇందిరా గాంధీకి తీవ్ర చికాకు కలిగించింది. ఇద్దరూ కలిసి పఠా భవనానికి హాజరయ్యారు, శ్రీమతి గాంధీ తన తండ్రి కంటే గాయత్రి పొందుతున్న రాచరిక హోదాని ఆమె అసహ్యించుకున్నారు. ” గాయత్రి దేవి అందం, ఆమె రాచరికపు హోదా ఇందిరకు గాయత్రిపై అసూయను మరింత పెంచింది. ఇదే రాజరిక వ్యవస్థపై ఇందిరా కోపాన్ని పెంచింది. అదనంగా, 1962 లోక్ సభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తరువాత, గాయత్రి దేవి ఒక మహిళా రాజకీయ శక్తిగా ఎదిగింది.రాజసంస్థానాల విలీనం అప్పుడు కుదుర్చున్న భరణాల చెల్లింపులు 1971 లో, భారత రాజ్యాంగంలోని 26 వ సవరణ ద్వారా రద్దు చేయబడ్డాయి. ఇది రాజకుటుంబాల పై తీవ్ర ప్రభావం చూపింది. 1975 జూన్ 25 న, ప్రధాని ఇందిర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రతిపక్ష నాయకులు, పాత్రికేయులు మరియు తన”శత్రువులు” అని ఆమె భావించిన వారినందరిని అరెస్టు చేయించారు.
వైద్య చికిత్స కోసం ఆ సమయంలో ముంబైలో ఉన్నారు గాయత్రి దేవి. ఆమె చికిత్స పూర్తయిన తర్వాత రాజధానికి తిరిగి వచ్చాక ఆమె ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు దాడి చేశారు, అప్రకటిత బంగారం మరియు సంపద ఆరోపణలపై ఆమె కాఫీపోసా (COFEPOSA) చట్టం కింద అరెస్టు చేశారు.గాయత్రీ దేవిని జూలై 1975 లో తీహార్ జైలులో పడేశారు, దాదాపు ఆరు నెలలు అక్కడ గడిపింది. గాయత్రి దేవి శ్రీలతా స్వామినాథన్ అనే ఎన్జీఓ వర్కర్ తో కలసి ఆమె తన సెల్‌ను పంచుకున్నారు. జైలులో ఉన్నప్పుడు, రాజ్‌మాత తిహార్ జైలులోని పిల్లలకు పాఠాలు చెప్పి, పలకలు మరియు పాఠ్యపుస్తకాలను ఏర్పాటు చేశారు. పిల్లల కోసం బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటుకు కూడా ఆమె సహాయపడింది. ఆమె జైలులో ఉన్న సమయం రాజ్‌మాత ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. తీహార్ చేరుకున్న కొన్ని వారాల తరువాత, ఆమెకు నోటి పుండు వచ్చింది. ఆమెకు మూడు వారాలు తరువాత కానీ వైద్య సదుపాయం కలిగించలేదు.జైలులో ఉన్న సమయంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది, రాజమాత పిత్తాశయ రాళ్ళతో బాధపడుతున్నట్లు తెలిసింది. చివరికి, ఇందిరా ప్రభుత్వం నిర్దేశించిన అనేక షరతులపై ఆమెను పెరోల్‌పై విడుదల చేశారు.
“నా విడుదల కోసం ఆర్డర్ జనవరి 1976 లో వచ్చింది. నా విడుదలను జరుపుకోవడానికి నవీన్ పట్నాయక్ మరియు ఇతరులను ఆహ్వానించాలనుకున్నాను. కానీ నవీన్ తండ్రి బిజు పట్నాయక్ ఇంకా జైలులో ఉన్నందున ఈ ఆలోచన విరమించుకున్నాను అని గాయత్రి దేవి, టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.జైలులో నుండి విడుదలైన తరువాత, ఆమె రాజకీయాల నుండి పూర్తిగా తొలిగి, ఎ ప్రిన్సెస్ రిమెంబర్స్: ది మెమరీస్ ఆఫ్ ది మహారాణి ఆఫ్ జైపూర్, అని ఆత్మకథ రాశారు. పక్షవాతం ఊపిరితిత్తుల వ్యాధులతో పోరాడిన తరువాత గాయత్రీ దేవి 29 జూలై 2009 న మరణించారు. (ది ఎమర్జెన్సీ: ఎ పర్సనల్ హిస్టరీ ,కూమి కపూర్, పఖ్యాత మహిళా పాత్రికేయులు వ్రాసిన పుస్తకం నుండి)చంద్రమౌళి న్యాయవాది నోటరీ న్యాయవాద పరిషత్ పశ్చిమగోదావరి జిల్లా.
Tags: Gayathri Devi’s name in the list of women
