Natyam ad

తిరుపతి విమానాశ్రయం అధికారిపై దాడి చేశారన్న కేసులో..

* ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసు కొట్టివేత..

* అమరావతి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడి

* 8 సంవత్సరాలుగా కోర్టుకు హాజరు

 

Post Midle

తిరుపతి ముచ్చట్లు:

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి విరుపాక్షి జయ చంద్ర రెడ్డి ల పై ఉన్న ఓ కేసును కొట్టివేస్తూ అమరావతిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తిరుపతి విమానాశ్రయం అధికారులపై దాడి చేశారంటూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి విరుపాక్షి జయ చంద్ర రెడ్డి మరియు 16 మంది ysrcp కార్యకర్తలు లపై అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో 2015 లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి 8 సంవత్సరాల పాటు ఈ కేసు విషయమై వీరు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు అమరావతి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా కేసుకు సంబంధించి ఆరోపణలు రుజువు కాలేదు. దీంతో కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రజా ప్రతినిధుల తరపున న్యాయవాదులు మధుకర్ బాబు, సురేష్, కోటిరెడ్డి వాదనలు వినిపించారు.

 

Tags: In the case of assault on Tirupati airport official..

Post Midle