Natyam ad

పేదల ఆరోగ్యం కోసమే జగనన్న సురక్ష

పుంగనూరుముచ్చట్లు:

పేద ప్రజల ఆరోగ్యాలకు ఎప్పటికప్పుడు పరీక్షించి , చికిత్సలు అందించేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. బుధవారం పట్టణంలోని తూర్పువెహోగసాల అర్భన్‌ హెల్త్ సెంటర్‌లో ఆరోగ్య శిభిరాన్ని కమిషనర్‌ నరసింహప్రసాద్‌తో కలసి ప్రారంభించారు. చైర్మన్‌ మాట్లాడుతూ శిబిరంలో 349 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. చక్కర, బిపి వ్యాదులు అధికంగా ఉన్నాయని తెలిపారు. వీరితో పాటు గర్భవతులకు ఎప్పటికప్పుడు చికిత్సలు అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి, మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ రంజిత, పుష్పకుమారి, రాహుల్‌, జయేష్‌ , సిబ్బంది కలసి శిబిరం నిర్వహించారు.

 

Post Midle

Tags: Jagananna Suraksha is for the health of the poor

Post Midle