ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి – ఎంపీ రెడ్డెప్ప
పుంగనూరు ముచ్చట్లు:
దివంగత కుప్పం వైఎస్సార్‌సీపీ బీసీ నాయకుడు చంద్రమౌళికి సదుం పాదయాత్రలో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకుని ఆయన కుమారుడు భరత్‌కు రాజకీయ భవిష్యత్తు కల్పించారని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కొనియాడారు. శనివారం పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డిని ఎంపీ సన్మానించారు. మండలాలు ఏర్పాటై ఏడాది కావడంతో మండల కార్యాలయంలో అభినందన సభ జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుప్పంను చంద్రబాబు నాయుడు విస్మరించారని దుయ్యబట్టారు. బీసీలు అధికంగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో బీసీలకు పదవి ఇవ్వకుండ చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా బీసీల స్థానం చేజిక్కించుకున్నారని ఆరోపించారు. భరత్‌కు ఎమ్మెల్సీ , పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్యానల్ స్పీకర్ మెంబరుగా గుర్తించడం బీసీలను గౌరవించడమేనని తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిలు కుప్పంను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో భరత్‌ను గెలిపించాలని , మంత్రి పదవి ఇస్తామని సీఎం ప్రకటించడం అభినందనీయమన్నారు. కుప్పంలో అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారని, చంద్రబాబుకు డిపాజిట్లు కూడ రావని ఎంపీ తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి , రాష్ట్ర వెహోదలియార్ల సంఘ డైరెక్టర్ మురుగప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags: Jaganmohan Reddy – MP Reddappa kept his promise
