Natyam ad

సరికొత్త రాజకీయంతో జనసేనాని

గుంటూరు  ముచ్చట్లు:

 

రాజకీయ విమర్శలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో అందరికీ తెలిసిందే. రాజకీయాలంటే అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. వివిధ కులాలు, మతాల సమాహారం కూడా. మహిళలు సైతం రాజకీయాల్లో రాణిస్తున్నారురాజకీయాల్లో ఔన్నత్యం అవసరం. ప్రత్యర్థి పార్టీలను,నేతలను సైద్ధాంతిక పరంగా విభేదించవచ్చు కానీ..వ్యక్తిగతంగా ఉండకూడదు.అయితే ఇదంతా గతం.ప్రస్తుతం రాజకీయాల్లో ప్రత్యర్థి అన్నమాట పక్కకు పోయింది.శత్రువు కంటే మించి అన్న భావన నెలకొంది.పగ,ప్రతీకార రాజకీయాలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. అధినాయకత్వాలే అటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోపవన్ కళ్యాణ్ బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఔన్నత్యం పాటిద్దామని సొంత పార్టీ శ్రేణులకు సూచించారు.ఇటీవల రాజకీయ విమర్శలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో అందరికీ తెలిసిందే. రాజకీయాలంటే అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. వివిధ కులాలు, మతాల సమాహారం కూడా. మహిళలు సైతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ తరుణంలో రాజకీయ విమర్శలు.. వ్యక్తిగత దాడులుగా మారుతున్నాయి. ఎదుటి మనిషిని పలుచన చేసేలా.. ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టేలా.. వారి వృత్తిని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు సాగుతున్నాయి. ఎదుటి మనిషి మనోభావాలు దెబ్బతింటున్నాయి. సమాజంపై దుష్పరిణామాలు చూపుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యకర రాజకీయ వాతావరణానికి పెను విఘాతంగా మారాయి.అయితే ఇటువంటి వ్యాఖ్యలకు ఏపీ రాజకీయాల్లో తొలి భాధితుడు పవన్ కళ్యాణ్. పార్టీ ఆవిర్భావం నుంచి ఏపీ శ్రేయస్సు కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులతో రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అవుతున్నారు. ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడని వైసీపీ నేత లేరు. ఆయన సినిమా జీవితంపై కూడా అవాకులు చవాకులు పేలుతున్నారు. తన వ్యక్తిగత జీవితం పై మాట్లాడవద్దని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కోరుతూ వచ్చారు. కానీ సాక్షాత్ సీఎం జగనే పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే విసిగి వేశారి పోయిన పవన్ తాను వ్యక్తిగతంగా మాట్లాడనని.. విధానపరంగా మాట్లాడుతానని.. ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే కామెంట్స్ చేస్తానని తేల్చి చెప్పారు. అప్పటినుంచి వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా.. ఎప్పుడు శృతిమించి మాట్లాడలేదు. ఇప్పుడు పార్టీ శ్రేణులకు సైతం ఇదే విషయంపై స్పష్టతనిచ్చారు.జనసేన అధికార ప్రతినిధులతో పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్పష్టమైన సూచనలు చేశారు. సమాజంపై బాధ్యతగా వ్యవహరిస్తూ పార్టీ వాయిస్ను వినిపించాలని పిలుపునిచ్చారు. టీవీ డిబేట్ లలో, చర్చల్లో సంయమనంతో వ్యవహరించాలని.. కుల, మత, ప్రాంతీయ, వర్గ వైశమ్యాల విషయంలో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచించారు. రాజకీయాల అన్నాక శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని.. ఎవరిని ఎప్పుడు కలవాల్సి వస్తుందో తెలియదని.. అందుకే ఆహ్లాదకర వాతావరణంలో రాజకీయాలు నడవాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. మొత్తానికైతే పవన్ ప్రసంగం జనసైనికుల మనసుకు హత్తుకుంది. పవన్ ఔన్నత్యాన్ని వారు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజెన్ల అభిమానాన్ని అందుకుంటున్నాయి.

 

Post Midle

Tags: Janasena with new politics

Post Midle