మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్రైలర్ అక్టోబర్ 3న విడుదల
హైద్రాబాద్ ముచ్చట్లు:
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న గ్రాండ్ గా విడుదల కానుంది. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అక్టోబర్ 3న ఈ చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అడవిలో పులిని వేటాడే విధంగా రవితేజ తన ప్రత్యర్థులపై దాడి చేస్తున్నట్లు ప్రెజెంట్ చేసిన మాస్ అప్పీలింగ్ పోస్టర్ ద్వారా ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. పోస్టర్ లో బీడీ తాగుతూ డాషింగ్ గా కనిపిస్తున్నారు రవితేజ.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున ఈ చిత్రం నుంచి ఇప్పటివరకూ రెండు పాటలను విడుదల చేశారు మేకర్స్. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో హీరోయిన్స్.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
తారాగణం: రవితేజ, నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు

Tags: Mass Maharaja Ravi Teja, Vamsi, Abhishek Aggarwal Arts Pan Indian Film ‘Tiger Nageswara Rao’ Trailer Released on 3rd October
