మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.
అమరావతి ముచ్చట్లు:
చంద్రబాబుకు నిజంగానే జగన్ మోహన్ రెడ్డి భయం పట్టుకుంది.పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు చంద్రబాబును షాక్ కు గురి చేశాయి.అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేక రాష్ట్రం నష్టపోయిందా లేక చంద్రబాబు లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని విడదీసినప్పుడా?కరోనా కాలంలో కూడా సీఎం వైఎస్ జగన్ ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా పరిపాలించారు.మన ప్రాంతం వాడివై ఉండి లేఖ ఇచ్చి తెలంగాణ కు మేలుచేశావు.అక్రమ ఇసుక రవాణా, కాల్ మని , నీరు చెట్టు లాంటి వాటితో 5 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారు.సీఎం వైఎస్ జగన్ పాలన పట్టిన పీడ అన్నారు, జగన్ వల్ల మంచి జరిగిందని ప్రజలకు తెలుసు.2019 లో రాష్ట్రం 51 శాతం ఓట్లు వేసి నీ పీడ వదిలించుకుంది.151 స్థానాలు ప్రజాలు మాకు ఇచ్చారు. ఇంతకంటే అవమానకరమైన ఫలితాలు నీకు ఎప్పుడైనా వచ్చాయా?2019 లో అధికారం లోకి వచ్చింటే కుప్పం అభివృద్ధికి కలలు కన్నానని చెపుతున్నారు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేశారు.5 ఏళ్ల లో రాజశేఖర్ రెడ్డి అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. జలయజ్ఞంలో 71 శాతం పనులు పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరిచ్చారు.కుప్పం ప్రజలు నీ ముసలి కన్నీరును నమ్మే పరిస్థితిలో లేరు.చంద్రబాబు ధర్మో రక్షతి రక్షతః అని నీతి సూక్తులు చెప్తున్నారు.ఆయన ధర్మాన్ని కాపాడాలని వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకున్నారు.ఇంకా ధర్మంగా ఉండాలని వారిలో నలుగురుకి మంత్రి పదవులు ఇచ్చారు.ఇప్పుడు లెక్కలు వేసుకోవాలని చెపుతున్న చంద్రబాబు అధికారం లో ఉన్నప్పుడు ఆకరణంగా అనేక మంది వైసీపీ నాయకులని జైల్లో పెట్టాడు,గతంలో మా పార్లమెంట్ సభ్యుడిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు.చంద్రబాబు హయాంలో కుప్పంలో ఎన్ని కేసులు, ఎన్ని రౌడీ షీట్లు పెట్టారో చూడాలిమా ప్రభుత్వం వచ్చాక ఎవరిపై అక్రమ కేసులు పెట్టలేదు, రౌడీ షీట్లు తెరవలేదు.తాను తెలిస్తే ఇంట్లో నుండి బయటకు రాలేమని చంద్రబాబు అన్నారు. మాకు మీసాలు ఉన్నాయి, ఈ జిల్లాలోనే మేము పుట్టాం.30 లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చి, 16 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. అలాంటిది శ్రీ వైఎస్ జగన్ టీడీపీ కట్టిన బిల్డింగ్స్ కు పెయింటింగ్ వేసుకుంటున్నారంటే ప్రజలు నవ్వుతారు.
ఇళ్ల పట్టాలపై కూడా స్టే తెప్పించారు అందుకే అధికారం లోకి వచ్చిన 3వ సంవత్సరంలో కార్యక్రమం చెప్పట్టాం.ఇండ్లకు ఇచ్చిన లోన్లు. ఓటీఎస్ ద్వారా సెటిల్ అవుతాయి, ఇల్లు మీ సొంతం అవుతుంది. బలవంతపు వసూళ్లు అని అబద్దాలు చెప్తున్నారు.మేము బెదిరిపోయే పరిస్థితి లేదు… చంద్రబాబుకి కాలం మూడింది.చంద్రబాబు కుప్పంలోనే పోటీ చెస్తాను అనడాన్ని ఆహ్వానిస్తున్నాం.చంద్రబాబు పోటీ చేస్తాడు, కుప్పంలో ఓడిపోతాడు. పరిపోకూడదని మీము ఆశిస్తున్నాం.మీ ఓటమి కుప్పంలో మేము చూడాలి, పారిపోవడం కాదు. అప్పుడే ప్రజలకు నువ్వేంటో ప్రజలకు అర్ధమవుతుంది.పుంగనూరులో నీకు కండిడేట్ లేడు, ఎవరిని పోటీ పెట్టి గెలుస్తావ్.నీ దగ్గర ఉన్న అటెండర్ ను పెట్టి నిన్ను కుప్పంలో ఓడించే సత్తా మాకు ఉంది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Minister Peddireddy Ramachandrareddy Comments.