Natyam ad

ముందుకు సాగని భూసర్వే

విజయవాడ ముచ్చట్లు:
 
సమగ్ర భూ సర్వే- శాశ్వత భూ హక్కు ప్రాజెక్టులో గ్రామసచివాలయ సర్వేయర్లు కీలకంగా మారారు. గ్రామ సచివాలయ వ్యవస్ధలో ప్రభుత్వంఒకేసారి 11,187మందిని నియమించింది. సమగ్ర సర్వేలో గ్రామసర్వేయర్లను వినియోగించుకోవడం ప్రభుత్వానికి తప్పని సరైంది.సర్వేయర్లుగా నియమాకాలు కావడం కొత్త కావడంతో ఆయా అభ్యర్ధులకు ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన సర్వే అకాడమీలో సర్వేయర్లతోపాటు డిజిటల్‌ అసిస్టెంట్లు, విఆర్‌ఓలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 275 బృందాలకు మొదటివిడతలో శిక్షణ ఇచ్చారు. వీరికి 50రకాల పని విధానాలపై శిక్షణ కొనసాగిస్తున్నారు. రీ సర్వేలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తుండటంతోఇందుకు సంబంధించిన సాంకేతిక మెళకువలపై సర్వే సెటిల్‌మెంట్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 2023 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 13జిల్లాల్లో భూముల సర్వే ప్రక్రియను నూరు శాతం పూర్తి చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. భూముల సర్వే ప్రక్రియ వేగవంతంగాజరగకపోవడానికి సవాలక్ష కారణాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం విడతల వారీగా ప్రకటించిన షెడ్యూల్‌ అమలు ఏ మేరకుసాధ్యమవుతుందనే అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17,460 రెవెన్యూ గ్రామాలు, 110 నగర,పట్టణాభివృద్ది పరిధిలోని భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయించడం చేయాలని నిర్ణయించారు. తొలి విడతలో 5,500, రెండో దశలో 6వేలు,మూడో దశలో మిగిలిన గ్రామాలు సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత పైలెట్‌ ప్రాజెక్టుగా నిర్ణయించిన 51 గ్రామాల్లో సర్వే ప్రక్రియనుపూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పటికే ఆయా గ్రామాల కొత్త రికార్డులను ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల ఆమోదం తెలిపిన తర్వాత సర్వే పూర్తయిన
భూములకు విశిష్ట సంఖ్యను అధికారులు కేటాయిస్తున్నారు. మరో 650 గ్రామాల్లో సర్వే పనులు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Non-progressive land survey