అధికార లాంఛనాలతోపింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి అంత్యక్రియలు

అమరావతి  ముచ్చట్లు:


జాతీయ పతాకరూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు.పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతా మహాలక్ష్మి (100) కన్నుమూసిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో కుమారుడు జీవీ నరసింహారావు ఇంట్లో గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.విషయం తెలియగానే.. ఏపీ సీఎం జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిందటి ఏడాది స్వయంగా మాచర్లకు వెళ్లి ఆమెను సత్కరించి ఆప్యాయంగా పలకరించారు సీఎం జగన్‌. ఆపై సాయం కింద రూ.75 లక్షల చెక్కును అందజేశారు .

 

Tags: Pingali Venkaiah’s daughter Sita Mahalakshmi was cremated with official ceremonies

Leave A Reply

Your email address will not be published.