Natyam ad

మే 1 నుంచి షిర్డి ఆలయం మూసివేత

ముంబై ముచ్చట్లు:


షిర్డీ సాయి బాబా ఆలయం మే 1 నుంచి మూతపడనుంది! ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తున్నట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. ఆలయ భద్రతకు సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)ను మోహరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా.. ఆలయాన్ని మూసివేస్తున్నట్టు స్పష్టం చేసింది.పలు మీడియా కథనాల ప్రకారం.. ఆలయ భద్రత నిర్వాహణకు సరిపడా శక్తి సీఐఎస్ఎఫ్ వద్ద లేదని మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని మేనేజ్మెంట్ వ్యతిరేకిస్తోంది.మహారాష్ట్ర అహ్మద్నగర్లో ఉంది ఈ షిర్డీ ప్రాంతం. సాయి బాబాను దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడి వస్తుంటారు. వీదేశీయుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా షిర్డీ.. ఓ పర్యాటక ప్రాంతంగానూ గుర్తింపు తెచ్చుకుంది. అహ్మద్నగర్- మన్మాడ్ హైవేపై ఉండే ఆలయాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఆలయ పరిసరాలు, ఉచిత భోజనం, వసతి గృహాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఛారిటీ స్కూల్స్- కాలేజీల నిర్వహణ బాధ్యతలు ఈ ట్రస్ట్ చూస్తూ ఉంటుంది.షిర్డీ విమానాశ్రయ భద్రతా బాధ్యతలను ప్రభుత్వం 2018లోనే సీఐఎస్ఎఫ్కు అప్పగించింది.

 

 

 

ఇక ఇప్పుడు.. ఆలయంలో భద్రత నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించింది. ఈ నిర్ణయం పట్ల ఆలయ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేసింది. షిర్డీ ఆలయంలో భద్రతా పరమైన విషయాలను చూసుకునే విధంగా సీఐఎస్ఎఫ్కు ట్రైనింగ్ ఇవ్వలేదని, అనంతరం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతోంది: షిర్డీ సాయి బాబా ఆలయానికి వెళ్లాలని భావిస్తున్న వారు ఈ విషయం పట్ల అప్రమత్తమై ఉండాలి. మే 1 నుంచి ప్రారంభమయ్యే నిరవధిక ఆలయ మూసివేత.. ఎప్పటివరకు కొనసాగుతుందో చెప్పలేము. మరోవైపు ఈలోపు.. ప్రభుత్వం- ఆలయ సిబ్బంది మధ్య చర్చలేవైనా జరిగితే, ఆలయం మూసివేత ఆంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

Post Midle

Tags; Shirdi temple will be closed from May 1

Post Midle