Natyam ad

సోమిరెడ్డివి దుష్ప్రచారాలే-మంత్రి కాకాణి

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరు లోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.కృష్ణ పట్నం పోర్టుకు సంబంధించి వస్తున్న వూహాగానాలపై స్పష్టత ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశా. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలోనీ కృష్ణ పట్నం పోర్టు మూత పడి బోతోంది,కొన్ని టెర్మినల్ లు మూసి వేశారు,ఉద్యోగులును తొలగించారు  అని దుష్ప్రచారం చేస్తున్నారు అవన్నీ అవాస్తవాలని అన్నారు.పోర్ట్ యాజమాన్యం తో నేను సంప్రదించా. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోర్టు లో నెల నెలా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది,ఉద్యోగ అవకాశాలు ఎక్కడా తగ్గడం లేదు,ప్రభుత్వానికి రెగ్యులర్ గా పన్నుకు చెల్లిస్తున్నం.   గత సంవత్సరం పోర్టుకు కార్గో ల ద్వారా  72 కోట్ల రూపాయల పన్నులు వస్తె ఈ సంవత్సరం  80 కోట్ల రూపాయలు పన్నులు రూపం లో వచ్చాయని అన్నారు.

 

 

రాజకీయం గా నన్ను ఎదుర్కోలేక సోమిరెడ్డి ఈ విధంగా కృష్ణ పట్నం పోర్టు పై దుష్ప్రచారం చేస్తున్నారు. రాబోవు ఎన్నికల్లో సోమిరెడ్డి పై నేనే పోటీ చేస్తా సోమిరెడ్డి పై మళ్ళీ గెలుస్తా. సోమిరెడ్డి లాంటి వారు కృష్ణ పట్నం పోర్టు పై చేస్తున్న ఆరోపణలు అన్నీ దుష్ప్రచారాలే. కృష్ణా పట్నం పోర్టు లో టెర్మినల్ తరలించినా,ఉద్యోగాలు తీసివేసినా,పోర్టు లో స్థానికులు కు ప్రాధాన్యత లేకున్నా,పోర్టు మూసే పరిస్థితి వచ్చినా అధికార పార్టీకి చెందిన నేనే పోర్టు ముందర కూర్చుని నిరసన చేస్తా,స్థానికం గా నా   నియోజక వర్గం ప్రజల సంక్షేమ నాకు ముఖ్యమని అన్నారు. సోమిరెడ్డి కేవలం డబ్బులు కోసం ఎన్నో సార్లు కృష్ణ పట్నం పోర్టు యాజమాన్యాన్ని ఎన్నో సార్లు బెదిరించారు అని మంత్రి కాకాణి విమర్శించారు.

 

Post Midle

Tags: Somireddy’s bad propaganda – Minister Kakani

Post Midle