Natyam ad

24 నుంచి పుంగనూరులో రెండురోజులు ఇస్తిమా

-సర్వం సిద్దం చేసిన ముస్లింలు
– ఇస్తిమాకు పోలీస్‌ బందోబస్తు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పట్టణ సమీపంలోని భీమగానిపల్లె క్రాస్‌ వద్ద నిర్వహిస్తున్న రెండు రోజుల ఇస్తిమా కార్యక్రమానికి ముస్లింలు సర్వం సిద్దం చేశారు. బుధ, గురువారాలలో రెండు రోజుల పాటు జరిగే ఇస్తిమా కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన మతగురువులు మౌలనాఫరూక్‌సాహెబ్‌ , అక్భర్‌సాహెబ్‌, ముఫ్తిఅస్లాంసాహెబ్‌, ఎంఎస్‌.సర్ధార్‌సాహెబ్‌ లచే రెండు రోజుల పాటు మతబోదనలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భీమగానిపల్లె వద్ద సుమారు 20 ఎకరాల భూమిని చదును చేసి షామియానాలు, పెండాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే సౌండ్‌బాక్సులు, స్పీకర్లు, ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇస్తిమాలో బోదనలకు, నమాజ్‌ ఇబ్బందులు లేకుండ ఏర్పాట్లు చేశారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు చెందిన సుమారు 50 వేల మంది ముస్లింలు ఇస్తిమా కార్యక్రమంలో ఒకొక్కరోజు పాల్గొనున్నట్లు తెలిసింది. వీరికి భోజనము, వసతి ఏర్పాట్లను చేపట్టారు. ముస్లింలు తమంతకు తాముగా ఇస్తిమా కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. కాగా ఇస్తిమా నిర్వహించే ప్రాంతంలో ప్రార్థనలకు ఎలాంటి ట్రాఫిక్‌, తదితర ఇబ్బంది కలగకుండ పలమనేరు డిఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐ రాఘవరెడ్డి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఇస్తిమా ఏర్పాట్లలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సీపీ సీమ జిల్లాల మైనార్టీసెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌ , మైనార్టీ నాయకులు అఫ్సర్‌, ఇబ్రహిం, అర్షద్‌అలి, తదితరులు పర్యవేక్షించారు.

Tags: Two days in Punganur from 24th

Post Midle