Natyam ad

2024 లోక్‌సభ ఎన్నికలకు ఏక్‌నాథ్ శిండే‌తో కలిసి వెళ్తాం : అమిత్ షా

కోల్హాపూర్  ముచ్చట్లు :


మహారాష్ట్ర కోల్హాపూర్‌లో జరిగిన బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ప్రసంగిస్తూ కీలక ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏక్‌నాథ్ శిండే‌తో కలిసి వెళ్తామని స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమౌతున్నాయని షా ఆరోపించారు. అయితే మోదీనిఓడించడం ఎవరి తరమూ కాదన్నారు. బీజేపీ సమృద్ధ భారత నిర్మాణం చేస్తుందన్నారు. రాబోయేవి మోదీని తిరిగి గెలిపించే ఎన్నికలు మాత్రమే కావని, సమృద్ధ భారత్ నిర్మాణం కోసం జరుగుతున్న ఎన్నికలని షా చెప్పారు. బీజేపీ ఆధునిక, సాంస్కృతిక భారత్‌ను నిర్మిస్తుందని చెప్పారు.2014కు ముందు ప్రతి మంత్రీ తనను తాను ప్రధానిగా భావించుకునేవారని, అవినీతి తీవ్రంగా ఉండేదని షా ఆరోపించారు. ఉగ్రవాదులు రెచ్చిపోతున్నా చోద్యం చూస్తుండిపోయేవారని షా గత పాలకులను ఎద్దేవా చేశారు. 2014కు ముందు శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉండేదని ఆయన వాపోయారు.శివాజీ జయంతి వేళ అమిత్ షా శివాజీ సాహసాలను కొనియాడారు. భారతమాత బానిస శృంఖలాలను తెంచేందుకు శివాజీ వీరోచితంగా పోరాడారని షా కీర్తించారు.సభలో షా ప్రధాని మోదీ పాలనాతీరుపై ప్రశంసలు కురిపించారు. మోదీ హయాంలో రక్షణ, విదేశీ నీతి అత్యంత ప్రభావవంతంగా ఉందని షా చెప్పారు.కొందరు అధికారం కోసం సిద్ధాంతాలు వదిలిపెట్టారంటూ అమిత్ షా శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరేపై విరుచుకుపడ్డారు.

 

 

 

గత ఎన్నికల్లో కలిసి పోటీచేసి అధికారం కోసం తమ ప్రత్యర్థులతో షా చేతులు కలపడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. అయితే ప్రస్తుతం విల్లు, బాణంతో అసలైన శివసేన మళ్లీ బీజేపీతో కలిసిపోయిందని షా చెప్పారు.ఎన్నికల సంఘం) నిన్న శివసేన ఉద్ధవ్ వర్గం నేత ఉద్ధవ్ థాకరే కు షాకిచ్చింది. శివసేన పార్టీ పేరును, గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించింది. శివసేన పార్టీ గుర్తు అయిన విల్లు, బాణం గుర్తును షిండేకు కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తరపున గెలిచిన 55 మందిలో 40 మంది షిండే వెంటే ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేలకు కలిపి 47,82,440 ఓట్లు పోలవగా, షిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు 36,57,327 ఓట్లు దక్కాయి. మొత్తం ఓట్లలో 76 శాతం షిండే వర్గానికి దక్కగా ఉద్ధవ్ వర్గానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలకు 12 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.

 

 

 

Post Midle

2018లో శివసేన పార్టీ రాజ్యాంగంలో సవరణలను తమకు చూపించలేదని, అవి తమకు సమ్మతం కాదని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది.2019లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2019) శివసేన బీజేపీ పొత్తులో సీట్లు పంచుకుని అధికారం చేపట్టేందుకు కావాల్సిన స్థానాలు సంపాదించారు. బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడంతో బాల్ థాకరే సమయంలోనే కుదిరిన పాత ఫార్ములా ప్రకారం ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే ముఖ్యమంత్రి పీఠమనే విషయానికి ఉద్ధవ్ తిలోదకాలిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడి ఏర్పాటు చేసుకుని రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. అయితే హిందుత్వ సిద్ధాంతాలపై ఉద్ధవ్ రాజీ పడటంతో ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సీఎం పదవి కోల్పోవడంతో పాటు మెజార్టీ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు శివసేన ఎమ్మెల్యే షిండే జట్టులో చేరిపోయారు. ఉద్ధవ్ ఒంటరివారైపోయారు.

 

Tags; We will go with Eknath Shinde to the 2024 Lok Sabha elections
: Amit Shah

Post Midle