Natyam ad

ఆటో ను ఢీ కొన్న ప్రైవేటు బస్ ఒకరి దుర్మరణం

-పలువురికి తీవ్రగాయాలయ్యాయి

మదనపల్లి  ముచ్చట్లు:


అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం లో ఓ ప్రైవట్ బస్ ఆటో ను ఢీ కొనడంతో ఒక మహిళ దుర్మరణం పాలయ్యారు.మదనపల్లి – నిమ్మనపల్లి మార్గమధ్యంలో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్ ఢీ కొనడంతో ఘటన స్థలంలోనే ఓ మహిళ ప్రాణాలు విడిచింది.మృతి చెందిన మహిళ తవళం పంచాయతి ఎగువపల్లి గ్రామానికి చెందిన రాజేంద్ర భార్య శ్యామల (30) మదనపల్లి లో ఓ హోటల్ లో పని చేస్తున్నది. ఆమెకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.అయితే ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ హేమంత్ తో పాటు ఆటోలో ఉన్న చిన్నపాప (65),శివయ్య (45), పుష్పలత (25), నరసమ్మ (40), మంజుల (20) తీవ్ర గాయాలపాలయ్యారు.ప్రమాదానికి గల కారణం అతి వేగమే అని నిమ్మనపల్లి ఎస్ఐ రామకృష్ణ తెలియజేసారు. బస్ యజమానులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

Post Midle

Tags: A private bus collided with an auto, killing one person

Post Midle