లారీలో కుళ్లిన మృతదేహం
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు టోల్ ప్లాజా వద్ద సిమెంట్ లారీలో ఒక మృతి దేహం లభించింది. లారీ లోనే కుళ్ళిపోయి పురుగులు పట్టిన మృతదేహాన్ని టోల్ ప్లాజా సిబ్బంది గుర్తించారు. సిమెంట్ లారీ నుంచి భయంకరమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం తెలిపారు. మృతుడు విజయవాడకు చెందిన షేక్ మస్తాన్ (45) గా గుర్తించారు. రాజమండ్రి సిమెంటు లోడు దిగుమతికి వెళ్లి విజయవాడ వస్తుండగా సంఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు 19వ తారీకు సిమెంట్ లోడుతో రాజమండ్రి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న హనుమాన్ జంక్షన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Tags: A rotting body in a lorry

