Natyam ad

ఢిల్లీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం

– వరుసగా నాలుగో రోజూ పడిపోయిన వాయు నాణ్యత పడిపోయింది
-వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నేడు ఉన్నత స్థాయి సమావేశం

 

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

Post Midle

దేశ రాజధాని ఢిల్లీ వాసులను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వరుసగా నాలుగో రోజూ వాయు నాణ్యత పడిపోయింది. సోమవారం ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి (AQI) 437గా ఉందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకటించింది. అయితే గత మూడు రోజులతో పోల్చితే ఇది కాస్త తగ్గింది. కాగా, వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నేడు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. మధ్యాహ్నం 12 గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌తోపాటు రవాణా శాఖ, ఢిల్లీ మున్సిపాలిటీ, పోలీస్‌, ఇతర శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన స్టేజ్‌-4 గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ అమలుపై చర్చించనున్నారు.

 

Tags: Air pollution is suffocating the people of Delhi

Post Midle