Natyam ad

అంగన్వాడి కేంద్రం నందు బాలింతలు, గర్భవతులు, తల్లులకు పోషణ వేడుక అవగాహన కార్యక్రమం నిర్వహణ. 

పుంగనూరు ముచ్చట్లు:
 
పోషణ అభియాన్ లో భాగంగా పుంగనూరు సూర్య నగర్ అంగన్వాడీ కెద్రం నందు నేడు పోషణ వేడుక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెండవ వార్డు కౌన్సిలర్  యువకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల బాలింతలకు, గర్భవతులకు పోషకాహారం చాల ముఖ్యమని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మరియు మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ప్రత్యేక శ్రద్ధ వహించి మహిళల అభివృద్ధికి ఎన్నో పథకాలు,కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోని మహిళల కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని అందులో భాగంగానే నేడు మహిళల ఆరోగ్యదృష్ట్య అంగన్వాడీ ల యందు ప్రతి నెల పోషణ వేడుకల అవగాహన కార్యక్రమం నివహించి బిడ్డ తల్లుల ఆరోగ్యానికి కావల్సిన పోషకాహారం ను ప్రతి ఇంటి బాలింతలకు, గర్భవతులకు,పిల్లల తల్లులకు తప్పక అందజేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త ఎమ్.పుణ్యవతి,ఎమ్ ఎస్ కె ధనలక్ష్మి,ఆరోగ్య సిబ్బంది వనిత, హిమాజ,కుమారి,బాలింతలు, గర్భవతులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Conducting nutrition awareness program for postpartum, pregnant and mothers at Anganwadi Center.