Natyam ad

మోర్లవారిపాలెంలో ప్రభుత్వ భూమి “హాంపట్”

-అక్రమార్కుల చెరలో 18 ఎకరాలు ప్రభుత్వ భూమి

నెల్లూరు ముచ్చట్లు:

కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని  అక్రమార్కులు దర్జాగా కాజేసిన పట్టించుకోని రెవిన్యూ శాఖ అధికారులు పోయినం నెల్లూరు జిల్లా కావలి మండలం మోచర్ల వారి పాలెం గ్రామంలో తేటతెల్లమైంది.కంచె చేను మేస్తే”అన్న సామెత వినే ఉంటారు. పెద్దలు ఈ సామెతను ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ… ప్రస్తుతం ఆ నానుడిని కడుపు నిండిన పెద్దమనుషులు  నిజం చేస్తున్నారు. “ఖాళీ జాగా కనిపిస్తే” చాలు,3వ కంటికి తెలియకుండా ఎంచెక్క  దర్జాగా కబ్జా చేసి చలామణి అవుతున్నారు. అది ప్రభుత్వ భూమి అయితే ఇక అక్రమార్కులకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. రెవిన్యూ కార్యాలయంలో పనిచేసే కొంతమంది అధికారులతో (అందరూ కాదు) పరిచయాలు ఉండటంతో దర్జాగా కాగితాలు పుట్టించుకొని ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు. కావలి మండలం భూకబ్జా రాయుళ్ళ కు అడ్డాగా మారింది. “పైసలు ఇస్తే చాలు.. పైళ్లు సైతం మార్చే చేతివాటం ఉన్న గ్రామ స్థాయి అధికారులు కావలి రెవెన్యూ కార్యాలయంలో మస్తుగా ఉండటంతో ఈ అక్రమార్కులకు వరంగా మారింది.

 

 

Post Midle

తుమ్మలపెంట పంచాయితీ మోర్ల వారిపాలెంలో 18 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో కావలి యం. యల్. ఏ గా పనిచేసిన  పెద్దాయన స్వర్గీయ కలికి యానాది రెడ్డి  గ్రామ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని 18 ఎకరాల ప్రభుత్వ భూమిని  (గ్రామ నత్తం) పశువుల మేత కోసం వదిలేరు.దీన్ని  ఆ గ్రామానికి చెందిన మోర్ల సురేష్, మోర్ల అంకులు, జంపాని రాములు, జంపాని శీనయ్య, మోర్ల లక్ష్మి నారాయణలు ఆక్రమించుకున్నారు. కోట్లు విలువ చేసే ఈ ప్రభుత్వ భూమి ప్రస్తుతం వారి అధీనంలో ఉంది.  సాధారణంగా  అధికారి పార్టీకి చెందిన వారు ఇలాంటి సాహసానికి పూనుకుంటారు. కానీ అక్కడ పరిస్థితులు అందుకు  బిన్నంగా ఉన్నాయి.వీరందరూ విపక్ష పార్టీకి చెందిన వారు కావటం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమార్కుల చెరలో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని పంచాయితీ ప్రజలు కోరుతున్నారు.

 

Tags: Government Land “Hampat” at Morlavaripalem

Post Midle