Natyam ad

అక్రమంగా తరలిపోతున్న గ్రావెల్

పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం…!
ఇష్టానుసారంగా రెచ్చిపోతున్న వైకాపా నాయకులు కార్యకర్తలు
ప్రభుత్వ ఆదాయానికి గండి..

బద్వేలుముచ్చట్లు:

Post Midle

ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ మార్గం గుండా గ్రావెల్(కంకర) తరలింపు బద్వేలు గోపవరం మండలాల పరిధిలో జోరుగా సాగుతుంది. దీనికి నిదర్శనం ఈ రెండు మండలాల పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంట, పొలాలను రియల్ ఎస్టేట్లుగా చేస్తూ పొలాలను కప్పి చదును చేసుకోవడానికి ప్రభుత్వ చెరువుల లో  అక్రమంగా పగల, రాత్రులు అన్న తేడా లేకుండా ట్రాక్టర్లతో, లారీలతో గ్రావెల్ (కంకర) ను తరలించకపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జోరుగా సాగించుకుంటున్నారు. అయితే వాటిని నిర్మూలించవలసిన రెవెన్యూ, ఇరిగేషన్,అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు తప్ప, ఈ అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్(కంకర) ను ఏ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసి వాళ్ళ వ్యాపారాలను యదేచిగా సాగించుకుంటున్నారు. అయినా  పట్టించుకోవలసిన అధికారులే పట్టించుకోకపోవడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే బద్వేలు గోపవరం మండలాల ప్రాంతంలో వివిధ చెరువులు ఉన్న మట్టి  అక్రమంగా పట్టపగలే గ్రావెల్ (కంకర) ను తీసుకువచ్చి సొమ్ము చేసుకుంటున్నారు  పంట పొలాల్లో గ్రావెల్ (కంకర) వేసి చదును చేసుకుని రియల్ ఎస్టేట్ అమ్మకాలకు స్థలాలను సిద్ధం చేసుకుంటున్నారు.

 

 

 

 

ఈ అక్రమ గ్రావెల్(కంకర) తరలింపులో  వైకాపా నాయకులు కార్యకర్తలు ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు ఈ అక్రమ గ్రావెల్ ( కంకర) తరలింపుకు వైకాపాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్టు సమాచారం ప్రభుత్వ చెరువులలో అక్రమంగా గ్రావెల్ (కంకర) ను రాత్రి ,పగలు అన్న తేడా లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ట్రాక్టర్లు పెట్టి తరలించడమే వేరే పని బద్వేలు గోపవరం మండలంలో ఇలాంటి వాళ్లు  చాలా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు ఈ రెండు మండలాల్లో చాలామంది అక్రమంగా గ్రావెల్(కంకర) వ్యాపారం సాగించుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కళ్ళు తెరిచి ఇలా అక్రమంగా గ్రావెల్ (కంకర) ప్రభుత్వ చెరువులు తరలిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. అలాగే భూగర్భ గనుల శాఖ (మైన్స్) అధికారులు,  బద్వేలు డివిజన్లో జరుగుతున్న అక్రమ గ్రావెల్(కంకర) త్రవ్వకాలపై ప్రత్యేక దృష్టి సాధిస్తే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

 

Tags:Illegal movement of gravel

Post Midle