Natyam ad

కవితకు మరోసారి నిరాశ.. సీబీఐ కస్టడీని పొడిగించిన కోర్టు

15 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని కోరిన సీబీఐ

9 రోజుల పాటు కస్టడీని పొడిగించిన కోర్టు

ఈ నెల 23 వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్న కవిత

 

Post Midle

ఢిల్లీ ముచ్చట్లు:

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. మరో 9 రోజుల పాటు కవిత కస్టడీని పొడిగించింది. 15 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే 9 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఈనెల 23 వరకు ఆమె సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. మరోవైపు కోర్టుకు హాజరవ్వుతున్న సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు కవిత స్పందించారు.

ఇది బీజేపీ కస్టడీ.. సీబీఐ కస్టడీ కాదంటూ ఆరోపించారు.

బీజేపీ నేతలు మాట్లాడిన మాటలే సీబీఐ అడుగుతోందని.. గత రెండేళ్లుగా అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారన్నారని కవిత తెలిపారు. అయితే కవిత వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 16న కోర్టులో విచారణకు రానుంది. ఈ క్రమంలో రేపు కూడా కవిత కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఢిల్లీ కోర్టు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన తరుణంలో రేపు బెయిల్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వెలువడుతుందో అన్న ఉత్కంఠ తెరమీదకు వచ్చింది.

 

Tags: Kavitha is once again disappointed.. Court extended CBI custody

Post Midle