లోపించిన పారిశుధ్యం-పట్టించుకోని అధికారులు
— అధికంగా జ్వరబాధితులు
— పట్టించుకోని వైద్యసిబ్బంది
— దోమల బెడదతో అవస్థలు
చౌడేపల్లె ముచ్చట్లు:
మండలంలోని శెట్టిపేట పంచాయతీ యర్రపల్లెతోపాటు ప్రంచాయతీలోని గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పారిశుధ్యలోపంతోపాటు , నివాస ప్రాంతాలకు ప్రక్కనే పేడ దిబ్బలు , చెత్త చెదారం నిల్వ ఉండడంతో దోమలకు నిలయంగా మారింది. మురుగునీటి కాలువలు శుభ్రపరచకపోవడంతో నీరంతా నిల్వ ఉండడం, కాలువల్లో చెత్త ఏపుగా పెరగడంతో నీరంతా ముందుకు కదలకపోవడంతో దుర్వాసతోపాటు, దోమ లార్వ పెరగడానికి కేంద్రంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దోమకాటుతోపాటు, నీటి కలుషితం కారణంగా గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇంటిలో ఒక్కరికి జ్వరం వస్తే అందరినీ చుట్టేసి వెళుతోంది. విపరీతమైన జ్వరం, ఒళ్ళునొప్పులు, తలనొప్పి లక్షణాలతో హడలెత్తించి పోతుంది. ప్రభుత్వ వైద్యసిబ్బంది పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆర్‌ఎంపి డాక్టర్‌ల వద్ద క్యూకడుతున్నారు. వైద్యసేవలందించి ప్రజలనుంచి దోచేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పారిశుధ్యపనులతోపాటు, మెరుగైన వైద్యసేవలందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags: Lack of sanitation – careless authorities
