ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన స్థానికులు
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి వద్ద ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై స్థానికులు దాడి చేసారు. బస్సు నిండుగా ప్రయాణికులు ఉండగా మరి కొంతమంది ఎక్కెందుకు యత్నం చేసారు. ఈ నేపధ్యంలో బస్సు కదులుతుండగా ఓ విద్యార్థిని కింద పడిపోయింది. దాంతో స్థానికులు ఆగ్రహంతో బస్సుని అడ్డుకొని డ్రైవర్ ఫిరోజ్ ను చితకబాదారు. ఆర్టీసీ డిఎం కరీమున్నీసా పోలీసులకు ఫిర్యాదు చేసారు.
Tags: Locals crushed the RTC driver

