Natyam ad

బిల్లులు ఇవ్వలేదని మేస్త్రి సెల్ టవర్ ఎక్కి నిరసన

బేతంచేర్ల ముచ్చట్లు:


ఆర్ అండ్ బి పనులలో భాగంగా బ్రిడ్జిలు,వంతెనలు నిర్మిస్తూ జీవనం కొనసాగించే ఓమేస్త్రి కి16 నెలలుగా కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకపోవడంతో మనస్తాపంకు గురై సెల్ టవర్ కి ఆత్మహత్యకు పాల్పడడం మండలంలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు గ్రామానికి చెందిన కోలాటి సత్యనారాయణ,అతని కుమారుడు సతీష్ ఇద్దరూబేతంచర్ల,డోన్ మండలాల కు చెందిన ఆర్ అండ్ బి పనులైన బ్రిడ్జిలు, వంతెనలు కార్మికులచేత నిర్మిస్తున్నారు.గుత్తేదారుడు పైడాల బలరామిరెడ్డి అలియాస్ పిటిఆర్ గా చలామణి అవుతూ టెండర్లు వేసి నిర్మాణాలను చేస్తున్న  విషయం విధితమే.ఈ గుత్తేదారుడైన పిటిఆర్ నుండి తండ్రీ కొడుకులిద్దరూ వంతెనలను నిర్మించిన కార్మికులకు వారు బయట అప్పులు చేసి చెల్లించడం తో అప్పులిచ్చిన వారు ఒత్తిడికి గురి చేయడం, గుత్తేదారుడు పిటీఆర్ పలకకపోవడంమే కాకుండా బెదిరింపు లకు గురి గురిచేయడం తో విసిగు,వేసారిన కోలాటి సత్యనారాయణ తమకు చావే శరణమని సెల్ టవర్ ఎక్కి, పెట్రోల్ పోసుకొని చనిపోతానని చెప్పడంతో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఐ ప్రియతమ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి విచారించగా గుత్తేదారుడు 16 నెలలుగా 10 లక్షల నలభై వేలు రూపాయలను చెల్లించకుండా ఇబ్బందుల గురి చేస్తున్నాడని, డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని సీఐ కు సత్యనారాయణ మొరపెట్టుకున్నారు.మీకు రావాల్సిన డబ్బులు పూర్తిగా చెల్లించే బాధ్యతను తీసుకొని మీకు న్యాయం చేస్తానని, హామీ ఇవ్వడంతో అతను టవర్ దిగాడు.

 

Tags: Mestri climbed the cell tower and protested that the bills were not paid

Post Midle
Post Midle