Natyam ad

నిత్యం ప్రమాదాలకు నిలయంగా నంది సర్కిల్

శ్రీకాళహస్తి ముచ్చట్లు :

శ్రీకాళహస్తి పట్టణంలోని నంది సర్కిల్ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. నాలుగు రోడ్లు సర్కిల్ కావడం ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, దీనికి తోడు నంది బొమ్మకు వెనకవైపు పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకుండా వాహన వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతూ తృటిలో ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన బ్యానర్లు కావడంతో వీటిని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ పట్టించుకోవడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.

Post Midle

Tags: Nandi Circle is home to constant accidents

Post Midle