పుంగనూరులో 13న జాతీయలోక్‌అదాలత్‌

పుంగనూరు ముచ్చట్లు:

పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు జాతీయ లోక్‌అదాలత్‌ను శనివారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌తో కలసి న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి కార్తీక్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించి, ప్రజలకు సత్వరన్యాయం అందించేందుకే లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెండింగ్‌ కేసులను పరిష్కరించేందుకు అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులలో అవగాహన కల్పించి, అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేలా కృషి చేసి, జాతీయలోక్‌అదాలత్‌ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags; National Lok Adalat on 13th at Punganur

Leave A Reply

Your email address will not be published.